Site icon 10TV Telugu

Sai Durgha Tej : మోస్ట్ డిజైరబుల్ మేల్ అవార్డు గెలుచుకున్న సుప్రీం హీరో.. తన స్టైల్ ఐకాన్‌ లు ఎవరో తెలుసా?

Sai Durgha Tej Wins Most Desirable Male Award at Filmfare Glamour & Style Awards South

Sai Durgha Tej

Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం హై బడ్జెట్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల పలు ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు సాయి తేజ్. తాజాగా సాయి దుర్గ తేజ్ ఫిలిం ఫేర్ మోస్ట్ డిజైరబుల్ – మేల్ అవార్డు అందుకున్నాడు.

యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమం ఆగస్టు 9 శనివారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. మొదటి సారి చేసిన ఈ కార్యక్రమంలో సౌత్ ఫిలిం స్టార్స్ చాలా మంది వచ్చారు. ఈ ఈవెంట్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ డిజైరబుల్ (మేల్) అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రదానం చేశారు.

Also Read : Athamma`s Kitchen : అత్తమ్మాస్ కిచెన్ ఎలా మొదలైందో తెలుసా? చరణ్ అర్ధరాత్రి వచ్చి అలా అడుగుతుండటంతో..

అనంతరం ఈ అవార్డుని తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గ తేజ్ కోరుకోవడంతో తేజ్ తల్లితండ్రులు ఇద్దరూ పైకి వచ్చి అవార్డు అందించారు. వేదికపైనే ఈ అవార్డుని సాయి దుర్గ తేజ్ తన తల్లికి అంకితం చేశారు.

అవార్డు అందుకున్న అనంతరం సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో నన్ను నా తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంది. నేను అంతా కోల్పోయానని అనుకున్నప్పుడు, నా తల్లి నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. ఆమె నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్ని ధరించి ప్రశాంతంగా సంతోషంగా ఉండండి. నా స్టైల్ ఐకాన్‌లు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ నా ఆల్ టైం ఫేవరేట్ అని తెలిపారు.

Also Read : Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..

ఈ కార్యక్రమంలో.. నాని, అడివి శేష్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, మాళవిక మోహనన్, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, నాగ వంశీ, ప్రగ్యా జైస్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, దేవి శ్రీ ప్రసాద్.. అనేకమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. పలువురు సెలబ్రిటీలు అవార్డులు గెలుచుకున్నారు.

Exit mobile version