Kamakshi Bhaskarla : నటిగా పీక్స్ లో కెరీర్.. సడెన్ గా సినిమాలకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్..
సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపిస్తూనే సినిమాల్లో డీ గ్లామర్ పాత్రలు చేసి మెప్పిస్తుంది కామాక్షి భాస్కర్ల. (Kamakshi Bhaskarla)
- Saketh U
- Updated on- May 5, 2026 / 05:01 PM IST
Kamakshi Bhaskarla Announce Break From Movies
Kamakshi Bhaskarla : నటిగా దూసుకుపోతున్న సమయంలో ఈ భామ సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. డాక్టర్ చదివి సినిమాల్లోకి వచ్చింది కామాక్షి భాస్కర్ల. ప్రియురాలు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మా ఊరి పొలిమేర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపిస్తూనే సినిమాల్లో డీ గ్లామర్ పాత్రలు చేసి మెప్పిస్తుంది కామాక్షి భాస్కర్ల. ఓ పక్క సినిమాలు, మరో పక్క సిరీస్ లతో బిజీగానే ఉంది. ఇటీవలే డెకాయిట్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. త్వరలోనే అగధ, మా ఊరి పొలిమేర 3 సినిమాలతో రానుంది. అయితే తాజాగా కామాక్షి భాస్కర్ల సినిమాలకు విరామం తీసుకున్నాను అని ప్రకటించింది.
Also Read : Jani Master : కష్టాల్లో నటి.. అమ్మ ఆపరేషన్ కి మొత్తం నేనే సాయం చేస్తానన్న జానీ మాస్టర్..
కామాక్షి భాస్కర్ల తన సోషల్ మీడియాలో.. నటన మీద విసుగొచ్చినందువల్ల కాదు, స్వీయ సంరక్షణ, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికే నటనా జీవితం నుండి, కెమెరాకు కాస్త దూరంగా నివసించాలని ఈ విరామం తీసుకున్నాను. నాకు తొందరేమీ లేదు. కేవలం స్వస్థత పొందుతూ, ఊపిరి పీల్చుకుంటూ, నా ఉనికిని గుర్తు చేసుకుంటున్నాను. కొన్నిసార్లు మన లక్ష్యాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి కాస్త వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. విరామం తీసుకున్నాను, మాయం అవ్వలేదు అని తెలిపింది.
దీంతో కామాక్షి భాస్కర్ల సినిమాలకు చిన్న బ్రేక్ ప్రకటించిందని తెలుస్తుంది. అయితే నటిగా బిజీగా ఉన్న సమయంలో, చేతిలో సినిమాలు ఉండగా, ఆఫర్స్ వస్తుండగా ఇలాంటి టైం లో కామాక్షి భాస్కర్ల ఎందుకు బ్రేక్ తీసుకుందని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Fauzi : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరు మృతి..
