Fauzi : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరు మృతి..
ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఒకరు మృతి చెందారు. (Fauzi)
Fauzi
Fauzi : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఒకరు మృతి చెందారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతునన్ సినిమా ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్స్ లో జరుగుతుంది.
ఈ సినిమా షూటింగ్ కి ప్రొడక్షన్ సభ్యులు ప్రయాణిస్తున్న కార్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. కార్ ఎదురుగా ఉన్న డివైడర్ కి గుద్దుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ కార్ లో ఆరుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఓ ప్రొడక్షన్ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు సభ్యులను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Also Read : Thaman : నువ్వు దేవుడివి సామి.. విజయ్ ని గెలిపించిన తమన్.. ఆకాశానికెత్తేస్తున్న విజయ్ ఫ్యాన్స్..
