Jani Master : కష్టాల్లో నటి.. అమ్మ ఆపరేషన్ కి మొత్తం నేనే సాయం చేస్తానన్న జానీ మాస్టర్..
జానీ మాస్టర్ ప్రస్తుతం మాస్ జాతర అనే కామెడీ షోకి జడ్జ్ గా చేస్తున్నారు. (Jani Master)
Jani Master
Jani Master : మన సెలబ్రిటీలలో చాలామంది సినీ పరిశ్రమలో, బయట ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుకొస్తారు. తాజాగా జానీ మాస్టర్ ఓ నటికి తన తల్లి ఆపరేషన్ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. జానీ మాస్టర్ ప్రస్తుతం మాస్ జాతర అనే కామెడీ షోకి జడ్జ్ గా చేస్తున్నారు.
ఈ షోలో స్కిట్స్ వేస్తున్న శోభ అనే నటి.. తన తల్లికి సర్జరీ చేయాలి. గతంలోనే సర్జరీ జరగాల్సింది కానీ డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు. అందుకే ఆపరేషన్ ఆగిపోయింది. లక్షన్నర వరకు చూసుకున్నాను ఇంకా 50 వేలు కావాలి అని షోలో తెలిపింది.
Also Read : Fauzi : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరు మృతి..
ఆమె కష్టాన్ని విన్న జానీ మాస్టర్ ఆ లక్షన్నర నీ దగ్గరే ఉండనివ్వు, మొత్తం ఆపరేషన్ కి కావాల్సిన రెండు లక్షలు నేనే ఇస్తాను అని తెలిపారు. దీంతో నటి శోభ ఎమోషనల్ అయింది. జానీ మాస్టర్ చేసే సాయాన్ని అంతా అభినందిస్తున్నారు.
