Sai Pallavi : వేరే హీరోయిన్ ఈ సినిమాని నాకు ఇచ్చింది.. నటిగా నిరూపించుకోవడానికే ఇలాంటి పాత్రలు..

సాయి పల్లవి మాట్లాడుతూ.. ''గార్గి కథను వినగానే ఈ పాత్రను కచ్చితంగా చేయాలి అనుకున్నాను. వకీల్‌ సాబ్‌, జై భీమ్‌ సినిమాల్లా సమాజానికి ఏదైనా చెప్పే ఆస్కారమున్న పాత్ర ఇది. ఇందులో అన్ని......

Sai Pallavi :  ఇటీవల విరాటపర్వం సినిమాలో తన నటనతో అలరించిన సాయి పల్లవికి ఆ సినిమా ఆశించినంత విజయం ఇవ్వలేదు. ప్రస్తుతం గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. జులై 15న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. తమిళ్ లో హీరో సూర్య, తెలుగులో రానా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది.

ఈ సినిమా గురించి, ఇందులోని క్యారెక్టర్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ”గార్గి కథను వినగానే ఈ పాత్రను కచ్చితంగా చేయాలి అనుకున్నాను. వకీల్‌ సాబ్‌, జై భీమ్‌ సినిమాల్లా సమాజానికి ఏదైనా చెప్పే ఆస్కారమున్న పాత్ర ఇది. ఇందులో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. న్యాయం కోసం పోరాడే నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఏ వ్యవస్థను, ఎవర్ని పాయింట్‌ చేయలేదు. ఒక అమ్మాయికి తనకు వచ్చిన ఆపదను, తనకున్న బంధనాలను దాటి ఎలా ఎదుర్కొందనేదే ఈ సినిమా కథ. ఇందులో నేను స్కూల్ టీచర్ పాత్రలో పోషించాను. నిజానికి నేను చాలా తక్కువగా స్కూల్ కి వెళ్ళాను. చిన్నప్పుడు డ్యాన్స్‌ నేర్చుకోవడానికి అటెండెన్స్‌ ఇచ్చి వెళిపోయేదాన్ని. ఈ సినిమాలో టీచర్‌గా నటించిన తర్వాత వారెంత కష్టపడతారో అర్థమైంది.” అని తెలిపింది.

Shanmukh Jashwanth : ఎట్టకేలకు బిగ్‌బాస్ తర్వాత వస్తున్న షన్ను.. ఆహాలో సూపర్ సిరీస్‌తో..

తన సినిమా పాత్రల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ”మొదట ఈ కథ ఐశ్వర్య లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆమె ఈ రోల్‌కి సాయిపల్లవి న్యాయం చేస్తుందని నా దగ్గరికి పంపించారు. ఆలా అనిపించడం నా అదృష్టం. ఆమె కూడా ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నారు. కొన్ని పాత్రలకు న్యాయం చేసే పేర్లను నేను కూడా ఇలాగే ప్రతిపాదించాను. వరుసగా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలనే చేస్తున్నాను. ఈ పాత్రలన్నీ నేను నటిగా నిరూపించుకోవడానికే. త్వరలో మళ్ళీ అల్లరి, చలాకీగా ఉండే పాత్రని ఓ కమర్షియల్ సినిమాలో చేస్తాను” అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు