Shanmukh Jashwanth : ఎట్టకేలకు బిగ్‌బాస్ తర్వాత వస్తున్న షన్ను.. ఆహాలో సూపర్ సిరీస్‌తో..

దాదాపు బిగ్‌బాస్ అయిపోయి ఆరు నెలలు కావొస్తున్నా షన్ను నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో షన్ను అభిమానులు నిరాశ చెందుతున్నారు. మొత్తానికి కెరీర్ మీద ఫోకస్ పెట్టి గతంలో ఓ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన షన్ను......

Shanmukh Jashwanth : ఎట్టకేలకు బిగ్‌బాస్ తర్వాత వస్తున్న షన్ను.. ఆహాలో సూపర్ సిరీస్‌తో..

Shannu

Shanmukh Jashwanth :  షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో ఫేమస్ యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించాడు. తెలుగులోనే అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సృష్టించాడు షన్ను. ఇక తన మాజీ ప్రేయసి దీప్తి సునైనా వల్ల మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. దీంతో బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తర్వాత అనుకున్నంత పేరు వచ్చింది కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టలేదు. తన ప్రేయసి దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పడంతో కెరీర్ లో కాస్త స్లో అయ్యాడు.

దాదాపు బిగ్‌బాస్ అయిపోయి ఆరు నెలలు కావొస్తున్నా షన్ను నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో షన్ను అభిమానులు నిరాశ చెందుతున్నారు. మొత్తానికి కెరీర్ మీద ఫోకస్ పెట్టి గతంలో ఓ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన షన్ను తాజాగా దాని టీజర్ ని రిలీజ్ చేశారు. షణ్ముఖ్ జశ్వంత్ మెయిన్ లీడ్ లో డిటెక్టీవ్ కామెడీ సబ్జెక్టుతో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే సిరీస్‌ని ఆహాలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేసి ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు.

RC15: వారసుడి కోసం చరణ్‌ను వెనక్కి నెడుతున్నారా..?

ఈ టీజర్ లో షన్ను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ తండ్రి.. ”ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్‌? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది? అసలు ఎంత ఖర్చవుతుంది? ఎంత మిగులుతుంది?” అంటూ షణ్ముఖ్‌ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్నలకు షన్ను.. ”నేను ఒక డిటెక్టివ్‌ ఏజెంట్‌ను, మనసు తప్ప.. ఫిజికల్‌గా, లిక్విడ్‌గా ఏం పోయినా వెతికి పెడతాను అని చెప్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో వెబ్‌ సిరీస్‌పై ప్రేక్షకులకి ఆసక్తి కలిగించారు. ఇక ఈ సిరీస్ కి షన్నుతో సూర్య, సాఫ్ట్‌వేర్ డెవలపర్ లాంటి సిరీస్ లు తెరకెక్కించిన డైరెక్టర్ సుబ్బు కథ అందివ్వగా అరుణ్‌ పవర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది. షణ్ముఖ్ ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.