RC15: వారసుడి కోసం చరణ్‌ను వెనక్కి నెడుతున్నారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుసుకుంటోంది.....

RC15: వారసుడి కోసం చరణ్‌ను వెనక్కి నెడుతున్నారా..?

Rc15 Release To Be Pushed Back For Vijay Varasadu

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుసుకుంటోంది. ఇక ఈ సినిమాను పవర్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన లుక్స్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది.

RC15: బ్యాక్ టు హైదరాబాద్!

కానీ, ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘వారసుడు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?

అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తే భారీ సక్సెస్ ను అందుకోవచ్చని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం చరణ్ తో చేస్తున్న సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పించి, మార్చి 30న రిలీజ్ చేయాలని ఆయన చూస్తున్నారట. చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఆయన అభిమానులు కూడా సంతోషిస్తారని దిల్ రాజు భావిస్తున్నారు. మరి నిజంగానే శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్టును తమిళ హీరో విజయ్ కోసం వెనక్కి నెడుతున్నారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.