RC15: బ్యాక్ టు హైదరాబాద్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరేవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో......

RC15: బ్యాక్ టు హైదరాబాద్!

Ram Charan Returned Back To Hyderabad After Punjab Schedule Completed

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరేవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇక పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరుపుకున్న చిత్ర యూనిట్, తాజాగా తిరిగి హైదరాబాద్ చేరుకుంది.

RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?

అమృత్‌సర్ షెడ్యూల్‌లో గతకొద్ది రోజులుగా ఓ సాంగ్ షూటింగ్‌లో చరణ్ పాల్గొన్నాడు. ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో చరణ్ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులతో రెచ్చిపోయాడట. ఈ సాంగ్‌తో పాటు అక్కడ కొన్ని కీలక సీన్స్‌ను కూడా చిత్ర యూనిట్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో చరణ్, ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాడు.

RC15: చరణ్ కన్నా విజయ్‌కే దిల్‌రాజు ప్రిఫరెన్స్.. ప్లాన్ చేంజ్ ఎందుకిలా?

ఇక త్వరలోనే హైదరాబాద్‌లో తిరిగి ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏకంగా 70 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. మిగతా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.