Sai Pallavi : తక్కువ సినిమాలతోనే తెలుగు, మలయాళం, తమిళ్ లో మంచి పేరు తెచ్చుకొని ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది సాయి పల్లవి. తెలుగులో అయితే లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునేంత రేంజ్ కి ఎదిగింది సాయి పల్లవి. గతంలో ఫాస్ట్ గా సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు మాత్రం అడపాదడపా, సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తండేల్, అమరన్ సినిమాలు ఉన్నాయి.
ఇటీవలే సాయి పల్లవి తన చెల్లి పూజా కన్నన్ పెళ్లి దగ్గరుండి మరీ చేసింది. సాయి పల్లవి చెల్లి పూజా పెళ్లి వారి బడగా కమ్యూనిటీ సంప్రదాయంలో ఘనంగా చేసారు. పూజా పెళ్లి వేడుకలు, ఫొటోలు, చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి హడావిడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చెల్లి పెళ్లి ముందు అయిపోవడంతో అందరూ ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి గురించి అడుగుతున్నారు. ఇలాంటి సమయంలో సాయి పల్లవి గతంలో తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Abhai Naveen : బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అభయ్.. అభయ్ భార్య, పాపని చూసారా..? అతని లవ్ స్టోరీ తెలుసా?
సాయి పల్లవి గతంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాకు చిన్నప్పుడు మా కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు. మా దాంట్లో చాలా మంది ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ దాటి వేరే వ్యక్తులని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మా ప్రాంతంలో నివసించట్లేదు. మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు కోయంబత్తూర్ లో ఉంటున్నారు కాబట్టి చుట్టూ ఎవరు ఏమనుకుంటారో అనే ఒత్తిడి వాళ్లకు ఉండదు. మా కమ్యూనిటీ కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాలో వాళ్ళని పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కి పిలవరు. అంత్యక్రియలకు కూడా రానివ్వరు. ఊళ్ళో జనాలు వేరేలా చూస్తారు. వాళ్ళని తమలో కలుపుకోరు. ఇది వాళ్ళ జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. నేను సినిమాలు చేసిన తర్వాత నా గురించి కూడా అలా మాట్లాడతారని నాకు ముందే తెలిసి మా నాన్నతో చెప్పాను. మా నాన్న చాలా అమాయకుడు. మా నాన్న కూడా నాకు పెళ్లి, కమ్యూనిటీ గురించి, అన్ని చోట్ల ఇది జరుగుతుంది అని చెప్పారు. దేనికోసమో పిల్లలని బ్లాక్ మెయిల్ చేయకూడదు, అది నాకు ఇబ్బందికరంగా అంటుంది అని మా నాన్నతో చెప్పాను అంటూ తెలిపింది.
సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకొని అందరూ సాయి పల్లవి పెళ్లి గురించి మాట్లాడుతుండటంతో గతంలో పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండైరెక్ట్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజిల గురించి సాయి పల్లవి మాట్లాడటం విశేషం. మరి ఎందరో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు, ఎవర్ని చేసుకుంటుందో చూడాలి.