Sai Pallavi: మరో సాయి పల్లవిని మీరు చూశారా..

టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ, విరాట పర్వం లాంటి భారీ ఎక్స్‌పక్టేషన్ కథల ప్రాజెక్టులతో వస్తున్నారు సాయి. మెస్మరైజింగ్ చూపులతో పాటు మెలికలు తిరిగే హొయల డ్యాన్స్‌తో కిర్రెక్కించే ఈ హైబ్రిడ్ పిల్లకి..

Sai Pallavi

Sai Pallavi: టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ, విరాట పర్వం లాంటి భారీ ఎక్స్‌పక్టేషన్ కథల ప్రాజెక్టులతో వస్తున్నారు సాయి. మెస్మరైజింగ్ చూపులతో పాటు మెలికలు తిరిగే హొయల డ్యాన్స్‌తో కిర్రెక్కించే ఈ హైబ్రిడ్ పిల్లకి.. చెల్లి కూడా సినిమాల్లోకి వచ్చేసింది.

అచ్చం అక్కలాగే కనిపించే పూజా కణ్నన్.. మంచి డ్యాన్సర్‌ కూడా. అక్క బాటలోనే చెల్లెలు కూడా హీరోయిన్‌గా వచ్చేస్తున్నట్లు సమాచారం. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’… ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ డైరక్షన్ చేయబోతున్న సినిమా ద్వారా పూజా కణ్ణన్‌ సిల్వర్ స్క్రీన్‌పై మెరవనున్నారట.

దర్శకుడిగా తొలి చిత్రం తీస్తున్న శివ. ఇందులో ఓ కీలక పాత్ర కూడా చేయనున్నారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కనిపించనున్నారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ‘కరు’ (తెలుగులో ‘కణం’) అనే సినిమాలో నటించారు.

అలాగే ఏఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేశారు పూజా కణ్ణన్‌. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్‌ ఫిలింలో పూజ కనిపించారు. అనుకున్నట్లుగానే పూజా కణ్ణన్‌ వెండితెర అరంగేట్రం షురూ అవుతుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో క్లియర్ అయిపోతుందన్నమాట.