Saiee Manjrekar : రామ్ బోయపాటి సినిమాలో సయీ మంజ్రేకర్.. చరణ్, ఎన్టీఆర్ పై కామెంట్స్!

మేజర్, గని సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సయీ మంజ్రేకర్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పై కామెంట్స్ చేసింది.

Saiee Manjrekar : ముంబై భామ సయీ మంజ్రేకర్.. సల్మాన్ ఖాన్ (Salman Khan) దబాంగ్ 3 తో సినిమా ఆడియన్స్ కి పరిచయమైంది. రెండు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన గని సినిమాలో నటించి అలరించింది. అయితే ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘మేజర్’. అడివిశేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా టాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది.

Ram Pothineni: బోయపాటి సినిమాలో రామ్ అలా కనిపిస్తాడా..?

అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను, రామ్ తో (Ram Pothineni) కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రామ్.. ఉంగరాలు జుట్టు, గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన ఆల్రెడీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్లు సయీ మంజ్రేకర్ తెలియజేసింది.

Akhil Akkineni : శోభితతో నాగచైతన్య రిలేషన్.. మీడియా ముందు అఖిల్ ఏమి మాట్లాడాడో తెలుసా?

ఒక తెలుగు మీడియాకి ఇచ్చిన ఛానల్ లో సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ.. “రామ్ నిజంగా ఎనర్జిటిక్‌ స్టార్. మూవీ సెట్ లో చాలా ఉత్సాహంగా ఉంటారు. సీన్స్ చిత్రీకరణ టైంలో నాకు చాలా సహాయపడేవారు. ఈ మూవీతో మీరంతా ఒక సరికొత్త రామ్ ని చూడబోతున్నారు” అంటూ పేర్కొంది. అలాగే సౌత్ హీరోలు గురించి మాట్లాడుతూ.. “సౌత్ హీరోలతో నేను నటించాలని అనుకుంటాను. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి గొప్ప యాక్టర్స్ తో కలిసి నటించాలని ఉంది” అంటూ వ్యాఖ్యానించింది.

 

ట్రెండింగ్ వార్తలు