Spirit: “స్పిరిట్” ఓపెనింగ్ కి ప్రభాస్ ఎందుకు రాలేదు.. కారణం అదేనా.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్(Spirit). ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Spirit: “స్పిరిట్” ఓపెనింగ్ కి ప్రభాస్ ఎందుకు రాలేదు.. కారణం అదేనా.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..

Why didn't Prabhas come to the opening of Spirit movie?

Updated On : November 24, 2025 / 6:50 AM IST

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్(Spirit). ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి కారణం ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అవడం. ఇప్పటివరకు ఆయన తీసినవి మూడు సినిమాలు మాత్రమే. ఈ మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు ఈ దర్శకుడు. ఈ దర్శకుడు కథను చెప్పే విధానం, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం చాలా కొత్తగా, వైలెంట్ గా ఉంటుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా దేనికదే ప్రత్యేకం. అలాంటి దర్శకుడు ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అదే, స్పిరిట్ సినిమా.

Rashi Khanna: అభిమానులు దూరంగానే ఉండాలి.. అదే ఇద్దరికీ మంచిది.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..

చాలా కాలం క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు అఫీషియల్ గా మొదలయ్యింది. నవంబర్ 23 దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ లో ఈ సినిమాకు సంబందించిన పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ కి హీరో ప్రభాస్ మాత్రం రాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. తన సినిమాకు ఓపెనింగ్ కి తానే రాకపోవడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు. ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో లేరు. కొన్నిరోజుల క్రితమే ఆయన ఒక ముఖ్యమైన పనికోసం జపాన్ వెళ్లారు. ఆ కారణంగానే ప్రభాస్ స్పిరిట్ సినిమా ఓపెనింగ్ కి రాలేదు అంటూ తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ప్రభాస్ గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ నుంచి టాక్ కూడా నడుస్తుంది. ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్ కి సంబందించిన లుక్ టెస్ట్ కూడా జరిగింది. 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.