Suman : పాపం.. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్ పళ్ళు రాలగొట్టిన సుమన్..
నటుడు సుమన్ తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు.(Suman)
Suman : సినిమాల్లో ఒక్కోసారి యాక్టింగ్ చేయాలంటే నిజంగానే కొట్టుకొని దెబ్బలు తిన్న సంఘటనలు ఉన్నాయి. అలా నటుడు సుమన్ కూడా నిజంగానే కొట్టి ఓ ఫైటర్ పళ్ళు రాలగొట్టాడట. నటుడు సుమన్ తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు.(Suman)
సుమన్ మాట్లాడుతూ.. నేను మొదట తమిళ్ సినిమాలు చేశాను. షూటింగ్ చూడటానికి వెళ్తే ఎవరో చూసి అడిగారు. అలా మూడు రోజులకే హీరో అయ్యాను. మా అమ్మ ఎంకరేజ్ చేయడంతో నేను వెళ్ళాను. నాకు యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు. సుందరం మాస్టర్ మొదటి సినిమాకు మేనేజ్ చేసారు. తర్వాత డ్యాన్స్ నేర్చుకొమ్మని చెప్పారు.
నాకు అప్పటికే కరాటే బ్లాక్ బెల్ట్ ఉంది, మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఫైట్ సీన్స్ లో నిజంగా కొట్టేవాడిని. దాంతో అవతల వాళ్లకు దెబ్బ గట్టిగా తగిలేది. అలా కొట్టకూడదు అంటే నేను చెయ్యి దగ్గరదాకా తీసుకొస్తాను మీరు నటించండి అంటే అలా ఒప్పుకునేవాళ్ళు కాదు. కొట్టాలి కానీ దెబ్బ తగలకూడదు. నాకు అది కష్టంగా ఉండేది. నేనేమో గట్టిగా కొట్టేవాడని. అలా ఓ ఫైటర్ అనుకోకుండా రాంగ్ డైరెక్షన్ లో రావడంతో కొట్టాను అతని పళ్ళు రాలాయి. అది అనుకోకుండా జరిగింది. అప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకున్నా కొట్టినట్టు చేయాలి అని తెలిపారు.
Also Read : Annamayya : ‘అన్నమయ్య’ చెయ్యను అని చెప్పా.. వేంకటేశ్వరస్వామి పాత్రపై సుమన్ కామెంట్స్ వైరల్.. పాపం 8 నెలలు..
