బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతోంది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులు ప్రకటించారు. 2102లో ఒక్కటైన సైఫ్, కరీనాలకు ఇప్పటికే తైమూర్ అలీఖాన్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. 2016లో ఈ జంటకు తైమూర్ జన్మించాడు.
‘మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’.. అని సైఫ్, కరీనా ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో కరీనా మళ్లీ తల్లి కాబోతుందనే పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.