Chiranjeevi – Venkatesh : చిరంజీవి హైదరాబాద్‌లో.. వెంకటేష్ వైజాగ్‌లో.. ఇవాళ రాత్రికి..

సైంధవ్‌, హనుమాన్ చిత్రయూనిట్స్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రెండు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నాయి.

Chiranjeevi – Venkatesh : ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో వెంకటేష్ సైంధవ్‌, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్(Hanuman) సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్‌(Saindhav) సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి రిలీజయ్యే మిగిలిన రెండు సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగ కంటే కూడా ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ ఫుల్ గా చేస్తున్నాయి.

సైంధవ్‌, హనుమాన్ చిత్రయూనిట్స్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రెండు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఒకే రోజు నిర్వహిచడం గమనార్హం. సైంధవ్‌, హనుమాన్ సినిమాలు రెండూ కూడా నేడు జనవరి 7న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి.

సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని RK బీచ్ వద్దనున్న గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా నేడు సాయంత్రం 6 గంటల నుండి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి వెంకటేష్ తో సహా సైంధవ్‌ చిత్రయూనిట్ అంతా హాజరవుతున్నారు. దీంతో వెంకీ మామ అభిమానులు, వైజాగ్ ప్రజలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు.

ఇక హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దీంతో ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు కూడా భారీగా తరలి వస్తున్నారు. చిరంజీవి ఆంజనేయస్వామికి భక్తుడని తెలిసిందే. గతంలో హనుమాన్ యానిమేటెడ్ సినిమాకి కూడా చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హనుమాన్ సినిమాలో కూడా హనుమాన్ పాత్రని చిరంజీవే చేసారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వస్తుండటంతో ఈ సినిమాపై, హనుమాన్ పాత్రపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Sankranthi Movies : సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది? ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది?

ఇలా ఒకే రోజు రెండు సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగడం, రెండు సినిమాలకి చిరంజీవి ఒక చోట, వెంకటేష్ ఒక చోట వెళ్తుండటంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు హీరోలు అటు వైజాగ్, ఇటు హైదరాబాద్ లో ఈవెంట్స్ కి హాజరవుతుండటంతో టాలీవుడ్ లో కూడా ఈ ఈవెంట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు