Saitej tweet Viral: టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ‘సింగిల్ ఆర్మీ’ అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఆ గ్రూప్ నుంచి నితిన్, రానా నిష్క్రమించారు. ‘నేను ఇక ‘భీష్మ’ ఎంత మాత్రమూ కాదు.. నాకు పెళ్లి అయిపోయింది’ అని నితిన్, ‘ఇది ఒక హఠాత్పరిణామము. సారీ రా అబ్బాయిలు’ అంటూ రానా ఆ గ్రూప్ నుంచి ఇటీవల Exit అయిపోయారు.
ఆ వాట్సాప్ వీడియోను షేర్ చేసిన మెగా హీరో సాయితేజ్ సోమవారం ఉదయం పది గంటలకు తను కూడా ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి.. మరిన్ని వివరాలు రేపు ఉదయం పది గంటలకు’ అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు అందరూ పెళ్లి కబురు చెప్పబోతున్నాడేమోనని సాయితేజ్‌కు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్.. ‘‘అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదనీ ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికనీ..అనుకోవడమే మనిషి పనీ’’.. అంటూ తేజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అయితే సాయితేజ్ ట్వీట్ చేసింది తన పెళ్లి గురించి కాదు.. తన కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా గురించి. సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా అప్‌డేట్‌కు సంబంధించే సాయితేజ్ ఈ ట్వీట్ చేశాడు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు.
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదనీ ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ…..
…….. ఆచార్య ఆత్రేయ ?? https://t.co/s45Ruh9LBw
— Harish Shankar .S (@harish2you) August 23, 2020