Prabhas : బుల్లి అభిమానితో ప్రభాస్ ఫోటో.. కల్కి మూవీలో..

కల్కి మూవీ సెట్స్ లో బుల్లి అభిమానితో ప్రభాస్ ఫోటో వైరల్. కల్కి మూవీలో..

Salaar star Prabhas with his little fan in Kalki movie sets

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తన మోకాలి సర్జరీని సక్సెస్‌ఫుల్ పూర్తి చేసుకొని వచ్చి.. మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఆ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు బయటకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్.. ప్రభాస్ ని కల్కి సెట్స్ లో కలుసుకున్న ఫొటోలు బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ప్రభాస్ లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. గుబురు గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ మళ్ళీ అలా కనిపించలేదు.

దీంతో ఆ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ప్రభాస్ కి సంబంధించిన మరో ఫోటో కూడా వైరల్ గా మారింది. ఆ పిక్ లో ఒక బుల్లి అభిమాని ప్రభాస్ తో కలిసి ఉండడం కనిపిస్తుంది. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో ఈ లుక్‌తోనే కనిపించబోతున్నారా..? అనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గెటప్ లో ప్రభాస్ కల్కి ఎలా కనిపించబోతున్నారో చూడాలి.

Also read : Bandla Ganesh : ఎన్టీఆర్‌పై నాకు కోపం లేదు.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్..

ఇది ఇలా ఉంటే, ఈ నెలలో ‘సలార్’ సినిమా రిలీజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ కి మరో 12 రోజులు సమయం మాత్రమే ఉంది. ఇటీవల ఒక ట్రైలర్ తప్ప.. ఈ మూవీ నుంచి మరో ప్రమోషన్ లేదు. ఒక ఇంటర్వ్యూ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన మాట లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అసలు పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన ప్రమోషన్స్ ఎక్కడ అంటూ క్యూస్షన్ చేస్తున్నారు.

కాగా సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరో వారంలో మరో ట్రైలర్ ని రిలీజ్ చేస్తారంటా, ఆ తరువాత సినిమాలో ఉన్న ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తారంటా. అంతకుమించి మరో ప్రమోషన్ ఏం చేయరని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమన్నది చూడాలి.