Salaar: కేజీఎఫ్‌ను మించి రెండింతలు గొప్పగా సలార్!
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస క్రేజీ ప్రాజెక్టులతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తిచేసిన

Salaar
Salaar: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస క్రేజీ ప్రాజెక్టులతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. కేజేఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను అంచనాలను మించేలా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ భారీ అప్లాజ్ సొంతం చేసుకున్నాయి.
భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా సలార్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారని మరో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాలపై మేకర్స్ నుండి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ఇప్పుడు ఓ క్రేజీ టాక్ మాత్రం మేకర్స్ నుండి బయటకొచ్చింది.
సలార్ సినిమా కేజీఎఫ్ కంటే రెండింతలు గొప్పగా ఉంటుందని మేకర్స్ టాక్ గా చెప్పుకుంటున్నారు. సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు కేజేఎఫ్ ను తలదన్నేలా ఉండడమే కాకుండా ప్రేక్షకులకు స్పెషల్ విజువల్ ట్రీట్ విస్మయానికి గురిచేస్తుందని చెప్తున్నారు. కేజేఎఫ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రాలకు ప్రతిరూపంగా నిలిస్తే, సలార్ హై యాక్షన్ ఫైట్ సీక్వెన్స్‌లతో ఎమోషనల్‌గా ఆకట్టుకునే కథతో సాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటైన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది.