Salman Khan : రెండు కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కార్‌లో వెళ్లి.. 60 మంది సెక్యూరిటీ మధ్య సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూట్..

బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Salman Khan Bigg Boss Shooting Happened with 60 members Security

Salman Khan : ఇటీవల మహారాష్ట్ర బాబా సిద్దిఖీ హత్యతో బాలీవుడ్ లో కూడా సంచలనం నెలకొంది. హీరో సల్మాన్ ఖాన్ కి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇప్పటికే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. బాబా సిద్ధిఖీ సల్మాన్ కి క్లోజ్ కావడంతో ఆయన మరణంతో సల్మాన్ ఇప్పటీకే విషాదంలో ఉన్నాడు. అయితే ఈ ఘటన జరిగిన దగ్గర్నుంచి సల్మాన్ బయటకి రావట్లేదు.

సల్మాన్ ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు పెట్టారు. ఆ దరిదాపుల్లోకి కొత్త వాళ్ళను కానీ, మీడియా వాళ్ళని కానీ రానివ్వట్లేదు. సల్మాన్ ఖాన్ ఇంటిని ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదించారు. అయితే సినిమా షూటింగ్స్ ఆపగలిగినా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 షూట్ మాత్రం ఆపలేదు. బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Arthamainda Arun Kumar : సీజన్ 2లో వేరే హీరో.. అర్థమైందా అరుణ్ కుమార్ లో ఈసారి హీరో ఎవరో తెలుసా?

శని, ఆదివారాలు సల్మాన్ ఖాన్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి వాటి షూటింగ్ పూర్తిచేశారు. అయితే దాదాపు 60 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య ఈ షూట్ జరిగినట్టు సమాచారం. అలాగే సల్మాన్ ఖాన్ కి వై+ సెక్యూరిటీ కూడా ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. వీటితో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే సల్మాన్ ప్రయాణిస్తున్నాడు. గతంలో సల్మాన్ దగ్గర ఓ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. అయితే ఇప్పుడు బెదిరింపులు ఎక్కువ అవడంతో ఇటీవలే రెండు కోట్ల ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్ తెప్పించి అందులోనే తిరుగుతున్నట్టు సమాచారం. Nissan Patrol SUV బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇండియాలో లేకపోవడంతో ఈ కార్ దుబాయ్ నుంచి తెప్పించాడట సల్మాన్ ఖాన్.

ఇలా ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య సల్మాన్ బయటకు వచ్చి బిగ్ బాస్ షూట్ చేయడంతో ఈ ఘటన చర్చగా మారింది. ఇంకా ఎన్ని రోజులు సల్మాన్ ఖాన్ ఇలా సెక్యూరిటీతో తిరగాలి, ఎన్ని రోజులు పబ్లిక్ కి దూరంగా ఉండాలో అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.