Salman – Ronaldo : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్ స్టార్స్.. బాక్సింగ్ మ్యాచ్‌లో సల్మాన్ ఖాన్, క్రిస్టియానో ​​రొనాల్డో..

సల్మాన్ ఖాన్, క్రిస్టియానో ​​రొనాల్డో ఒక దగ్గరే కూర్చొని బాక్సింగ్ మ్యాచ్‌ వీక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Salman Khan Cristiano Ronaldo at Saudi Arabia boxing match video

Salman Khan – Cristiano Ronaldo : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ఒక దగ్గరే కూర్చొని బాక్సింగ్ మ్యాచ్‌ వీక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. క్రిస్టియానో ​​రొనాల్డో వరల్డ్ వైడ్ గా ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇక సల్మాన్ ఖాన్ కి కూడా ఇండియాతో పాటు సౌదీ వంటి దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం కామన్ ఫ్యాన్స్ కి కన్నుల విందుగా ఉంది.

సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవల టైసన్ ఫ్యూరీ మరియు ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని వీక్షించడానికి ప్రపంచంలోని చాలామంది ప్రముఖులు అక్కడికి హాజరయ్యారు. ఈక్రమంలోనే క్రిస్టియానో ​​రొనాల్డో తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ కలిసి ఆ మ్యాచ్ కి వచ్చాడు. ఇక సల్మాన్ కూడా ఈ మ్యాచ్ కి హాజరు కాగా.. వారి పక్కనే వీవీఐపీ సీట్లలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నట్లు కనిపించింది. ​​రొనాల్డో పక్కన జార్జినా కూర్చోగా.. ఆమె పక్కన సల్మాన్ కూర్చొని కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Anasuya : సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం..

ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. టైగర్ 3 సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ లో చూసిన దానికంటే సినిమా మించి ఉంటుందని సల్మాన్ చెప్పుకొస్తున్నాడు. సినిమాలో దాదాపు 50-60 శాతం యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలియజేశాడు. నవంబర్ 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.