Salman Khan Fans : ఇదెక్కడి అరాచకంరా బాబోయ్.. థియేటర్లో టపాసులు కాల్చారు!

అందరిలా చేస్తే వాళ్లు సల్మాన్ ఫ్యాన్స్ ఎందుకువుతారు.. అందుకే ఏకంగా థియేటర్లోనే టపాసులు కాల్చి రచ్చ రచ్చ చేశారు..

Salman Khan Fans : ఇదెక్కడి అరాచకంరా బాబోయ్.. థియేటర్లో టపాసులు కాల్చారు!

Salman Khan Fans

Updated On : November 30, 2021 / 2:13 PM IST

Salman Khan Fans: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. భాయ్ జాన్ సినిమాలు వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంటాయి. ఇక థియేటర్లలో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అభిమానులు చేసే రచ్చ అయితే మామూలుగా ఉండదు. పాండమిక్ కారణంగా ఈద్‌ పండుగకి, అలాగే థియేటర్లో సల్లూ భాయ్ సినిమా చూసే అవకాశం రాలేదు.

Prabhas : ‘ఇన్నాళ్లూ ఈ రొమాన్స్ మిస్ అయిపోయాం డార్లింగ్’..

ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘రాధే’ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ పెద్దగా స్పందన రాలేదు. రీసెంట్‌గా ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. భారీ అంచనాల మధ్య ఈనెల 26న సినిమా విడుదలైంది.

Payal Rajput : టాప్ లేపిన పాయల్ రాజ్ పుత్.. డిలీట్ చేసిన ఆ వీడియో ఇదే..!

మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సల్మాన్ కీలకపాత్రలో కనిపించారు. పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు రాబడుతోందీ చిత్రం. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్ బయట టపాసులు కాలుస్తుంటారు ఫ్యాన్స్.

Valimai : ‘భీమ్లా నాయక్’ తర్వాత రోజే ‘తల’ అజిత్ సినిమా!

అందరిలా చేస్తే వాళ్లు సల్మాన్ ఫ్యాన్స్ ఎందుకువుతారు.. అందుకే ఏకంగా థియేటర్లోనే టపాసులు కాల్చి రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియోను సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇలా థియేటర్ లోపల క్రాకర్స్ కాల్చడం మంచి పద్ధతి కాదు. చాలా పెద్ద ప్రమాదం జరిగుతుంది. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండమని నా అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నా అని కామెంట్ చేశారు సల్లూ భాయ్.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)