Salman Khan Kisi ka Bhai Kisi Ki Jaan trying to get 100 crores
Salman Khan : సల్మాన్ ఖాన్.. ఫ్లాప్ సినిమా కూడా 100కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ సవాల్ విసిరిన స్టార్ హీరో. ఓపెనింగ్స్ తోనే రికార్డుల బద్దలుకొట్టే సత్తా ఉన్న టాప్ హీరో. జస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లతోనే మిడ్ రేంజ్ సినిమా చేసేంత కలెక్ట్ చేసే స్టామినా ఉన్న హీరో. రికార్డులు, కలెక్షన్లకి కేరాఫ్ అడ్రస్ సల్మాన్. బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో గా భాయ్ కి ఉన్న క్రేజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అలాంటి సల్మాన్ ఖాన్ స్టామినా తగ్గిపోయిందా..? కలెక్షన్ల కెపాసిటీ కాస్త వీక్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి లెక్కలు. ఒకప్పుడు ఓపెనింగ్ డేనే 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సల్మాన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులవుతున్నా ఇంకా 100 కోట్లు కలెక్ట్ చెయ్యడానికి ఆపసోపాలు పడుతున్నాడు.
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడనుకున్న సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా పోయిన శుక్రవారం ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓపెనింగ్ డే జస్ట్ 16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. భాయ్ మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇదేమంత పెద్ద కలెక్షన్ కానేకాదు. నిన్న కాక మొన్న 5 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన షారూఖ్ ఓపెనింగ్ డేనే 100కోట్ల కలెక్షన్లతో, మొత్తం వెయ్యికోట్ల కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తే సల్మాన్ మాత్రం ఇంకా కలెక్షన్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ వీకెండ్ పర్వాలేదనిపిస్తే వీక్ స్టార్టింగ్ రోజుకి 10 కోట్లు రాబట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఇప్పటి వరకూ జస్ట్ 80 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
అసలు సల్మాన్ కలెక్షన్ల రేంజే వేరు. ఇప్పటి వరకూ సల్మాన్ ఓపెనింగ్ డే కలెక్షన్లతో 2019 లో వచ్చిన భారత్.. 42 కోట్లతో హయ్యస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రేమ్ రతన్ ధన్ పాయో 40 కోట్ల ఓపెనింగ్స్ తో బెస్ట్ సెకండ్ గా నిలిచింది. సల్మాన్ కెరీర్ లోనే సమ్ థింగ్ డిఫరెంట్ మూవీ సుల్తాన్ 36 కోట్లు, టైగర్ జిందా హే 32 కోట్లు కలెక్ట్ చేసింది. 2019 లోనే వచ్చిన దబాంగ్ 24 కోట్లు, భజరంగీ భాయ్ జాన్ 27, అసలు అంతగా హిట్ అవ్వని రేస్ కూడా ఓపెనింగ్ రోజు 28 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇంత భారీ ఓపెనింగ్స్ సాధించే సల్మాన్ తన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మాత్రం యావరేజ్ సినిమా లిస్ట్ లోకి చేరి కలెక్షన్ల నంబర్లు పెంచుకోవడానికి కష్టపడుతోంది. సౌత్ మార్కెట్ టార్గెట్ చేసి వెంకటేష్, పూజాహెగ్డే, జగపతి బాబు, భూమిక, రామ్ చరణ్ గెస్ట్ అప్పీరిన్స్.. ఇంతమందిని పెట్టినా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు.
Maniratnam : మణిరత్నం మ్యాజిక్ మిస్ అవుతుందా??
ఇప్పుడు బాలీవుడ్ కాదు, సౌత్ లో మీడియం హీరోలు కూడా 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తున్నారు. నాని మొదటి రోజు దసరా సినిమా ఏకంగా 38 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో సగం కూడా సల్మాన్ తన మొదటి రోజు కలెక్ట్ చేయలేకపోయాడు. దీంతో భాయ్ కి ఏమైంది? 100 కోట్లు రాబట్టడానికి ఇంత కష్టపడుతున్నాడు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చే టైగర్ 3 సినిమాకు అయినా భాయ్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.