Salman Khan : హీరోకి స్టేజిపై అందరిముందు ముద్దులు పెట్టిన సల్మాన్ ఖాన్..

ఇటీవల ముంబైలో అభిమానుల మధ్య టైగర్ 3 స్పెషల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

Salman Khan Kisses to Hero Imran Hashmi in Tiger 3 Success Event

Salman Khan : యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి స్పై మూవీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్(Salman Khan) టైగర్ 3(Tiger 3) సినిమా ఇటీవల నవంబర్ 12న రిలీజయింది. సల్మాన్ టైగర్ 3 పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో కత్రినా కైఫ్(Katrina Kaif) హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్ర చేయడం విశేషం.

టైగర్ 3 సినిమా ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఓ మాదిరి విజయం సాధించింది. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇటీవల ముంబైలో అభిమానుల మధ్య ఈ స్పెషల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

అయితే ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తో నేను చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఇమ్రాన్..అతిష్ పాత్రలో లేకపోతే అతనికి కూడా ఐలా జరిగేది అంటూ సడెన్ గా ఇమ్రాన్ వద్దకు వెళ్లి ఇమ్రాన్ మొహంపై ముద్దుల వర్షం కురిపించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా అరుపులు, విజిల్స్ తో సందడి చేశారు. ఇమ్రాన్ కి ఇలా స్టేజిపై అందరి ముందు ముద్దు పెట్టిన సల్మాన్ ఆ తర్వాత.. నేను ఎక్కువగా ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్ కి అది బాగా అలవాటు. ఈ సినిమాలో ఇమ్రాన్ అది మిస్ అయినందుకు నేను ఇలా అతని లోటు తీర్చాను అని అందర్నీ నవ్వించాడు.

Also Read : Lavanya Tripathi : బాగా చూసుకునే భర్త వచ్చాడు.. లావణ్య స్పెషల్ పోస్ట్.. చీర మీద, చెప్పుల మీద.. ఎక్కడ చూసినా వరుణ్ లావ్..

దీంతో సల్మాన్ ఖాన్ ఇమ్రాన్ హష్మీకి ముద్దులు పెట్టిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్లో సల్మాన్, కత్రినా కలిసి డ్యాన్స్ కూడా చేశారు.