Mahesh Babu : హిందీ బిగ్‌బాస్ లో మహేష్ బాబుని పొగిడిన సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ లో మహేష్ మరదలు..

హిందీ బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Salman Khan Praises Mahesh Babu in Hindi Bigg Boss

Mahesh Babu : మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ కూడా గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసింది. ప్రస్తుతం అడపాదడపా టీవీ షోలు, సినిమాలు చేస్తుంది శిల్ప. ప్రస్తుతం శిల్ప శిరోద్కర్ హిందీ బిగ్ బాస్ లో ఉంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో శిల్ప కూడా ఆడుతుంది. ఇటీవల నమ్రత కూడా తన చెల్లికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ పోస్ట్ కూడా చేసింది.

Also Read : Pushpa 2 : పుష్ప 2 తమిళనాడులో ఫస్ట్ డే ఏకంగా 3500 షోలు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని వందల స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?

హిందీ బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఎపిసోడ్ లో శిల్ప శిరోద్కర్ తో మాట్లాడుతూ సల్మాన్ మహేష్ బాబు ప్రస్తావన తీసుకువచ్చారు. సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.