సల్లూభాయ్.. జై జవాన్.. జై కిసాన్..

  • Publish Date - July 13, 2020 / 12:19 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రైతుగా మారాడు.. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి పన్వేల్ లోని తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్న సల్లూభాయ్
తాజాగా నాట్లు వేస్తున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు.

గ్రే కలర్ టీ-షర్ట్, షార్ట్, క్యాప్‌, రెండు చేతులతో వరిపైరు పట్టుకున్న ఫోటోను ‘‘Daane daane pe likha hota hai khane wale Ka naam… jai jawan ! jai kissan ! (ప్రతి గింజ మీద తినేవాళ్ల పేరు రాసి ఉంటుంది. జై జవాన్‌! జై కిసాన్‌!)’’ అనే కొటేషన్ తో షేర్ చేశారు.

కాగా ఈ ఫోటోకు ఇప్పటివరకు 2.4 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం. ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌తో పాటు ప్రేయసి Lulia Vantur, హీరోయిన్ Jacqueline Fernandez లతో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

Read Here>>బాలీవుడ్ నటి కన్నుమూత