Kisi Ka Bhai Kisi Ki Jaan OTT release
Salman Khan-Venkatesh : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్‌లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను జీ 5 పెద్ద మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 23 నుంచి ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ ఓటీటీలో మాత్రం సత్తా చాటాయి. మరీ అదే విధంగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఓటీటీలోనైనా అభిమానులను అలరిస్తుందో లేదా చూడాలి.
VD 12 : డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ సినిమా నుంచి కీలక అప్డేట్..
Watch action, drama aur romance se packed #KisiKaBhaiKisiKiJaan, World Digital Premiere on 23rd June only on @ZEE5India #BhaijaanOnZEE5 @hegdepooja @VenkyMama @farhad_samji @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @jassiegill @siddnigam_off… pic.twitter.com/0MVqSdoCla
— Salman Khan (@BeingSalmanKhan) June 16, 2023
Adipurush review : నిరాశపరిచింది.. భారీ గందరగోళాన్ని సృష్టించింది.. అంచనాలను అందుకోలేదు
ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’ (Tiger 3) సినిమాలో నటిస్తున్నాడు. టైగర్ సిరీస్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకముందు వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా’ సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది.