Salman Donation: కొవిడ్ సంక్షోభంలో 25వేల మంది సినీ కార్మికులకు రూ.1500 ఆర్థిక సాయం

యాక్టర్ సల్మాన్ ఖాన్ తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలోని వర్కర్లకు హెల్ప్ చేయాలని ప్లాన్ చేశారు.

Salman Donation: యాక్టర్ సల్మాన్ ఖాన్ తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలోని వర్కర్లకు హెల్ప్ చేయాలని ప్లాన్ చేశారు. సెకండ్ వేవ్ కారణంగా లాక్‌డౌన్ రావడంతో చాలా సినిమా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండిపోయాయి. దాని కారణంగా చాలా మంది ఆదాయం కోల్పోయారు. అలాంటి వారందరికీ ఆర్థిక సాయం అందించేందుకు సల్లూ భాయ్ ముందుకొచ్చాడు.

టెక్నిషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ ఆర్టిస్టులకు కలిపి మొత్తం 25వేల మందికి రూ.1500 వరకూ ఇవ్వనున్నారు. వెస్టరన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబె మాట్లాడుతూ… ‘సల్మాన్ ఖాన్ మేనేజర్ బీఎన్ తివారీ మమ్మల్ని ఫెడరేషన్ నుంచి 25వేల మంది కార్మికులు వివరాలను పంపించమని అడిగారు’ అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి సినిమా ప్రాజెక్టు పనులు డిసెంబర్ నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి వరకూ వర్కర్లందరికీ ఉపాధి దొరికేది. సెకండ్ వేవ్ మొదలై పనులన్నీ ఆగిపోయాయి. మళ్లీ పనులు ఎప్పుడు మొదలవుతాయో కూడా అర్థం కావడం లేదని అశోక్ దూబె అన్నారు.

సల్మాన్ మేనేజర్ తివారీ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కు పేర్ల లిస్టు పంపించాం. డబ్బులు డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యశ్ రాజ్ ఫిల్మ్ కు 35వేల మంది సీనియర్ సిటిజన్స్ నెంబర్లు పంపాం. యశ్ రాజ్ సంస్థ మనిషికి రూ.5వేలు, కుటుంబానికి నెలవారీ రేషన్ ఇవ్వాలని అనుకుంటుంది. వివరాలు వెరిఫై చేసుకుని ఈప్రక్రియ మొదలుపెడతారు.

ట్రెండింగ్ వార్తలు