‘అల వైకుంఠపురములో’ మలయాళీ వెర్షన్ ‘అంగ వైకుంఠపురత్తు’ నుంచి ‘సామజవరగమన’ మలయాళీ సాంగ్ రిలీజ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.. అల్లు అర్జున్‌కి మలయాళంలోనూ అభిమానులున్నారు.. తనని అక్కడ మల్లు అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే..
ఈ సినిమాను ‘అంగ వైకుంఠపురత్తు’ పేరుతో మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మలయాళీ ప్రేక్షకులను ఆకట్టుకుంలుంది. ఆదివారం (నవంబర్ 10) ‘సామజవరగమన’ మలయాళీ సాంగ్ విడుదల చేశారు.
Read Also : గొప్పదిరా మనిషి పుట్టుక – హార్ట్ టచింగ్ సాంగ్
థమన్ ట్యూన్‌కి హరినారాయణన్ లిరిక్స్ రాయగా, మెలోడి సాంగ్స్‌కి పాపులర్ అయిన విజయ్ యేసుదాస్ చాలా చక్కగా పాడారు. తెలుగు పాటకి ఏమాత్రం తగ్గకుండా ఉంది మలయాళీ సాంగ్.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ తెలుగుతో పాటు మలయాళంలోనూ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.