Samantha : జిమ్‌లో సమంత కసరత్తులు చూశారా..? వీడియో వైరల్..
జిమ్‌లో సమంత కసరత్తులు చూశారా..? రోలర్ వర్క్ అవుట్ చేస్తూ..
- gum 95921
- Published On : November 25, 2023 / 03:29 PM IST
Samantha Ab Roller Workout in gym video gone viral
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రెజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం దృష్టి పెట్టారు. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ఒక పక్క చికిత్స తీసుకుంటున్న సమంత.. మరోపక్క ఫిట్‌నెస్ మంత్రా కూడా ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఈక్రమంలోనే యోగా, ధ్యానంతో పాటు జిమ్ లో కూడా వర్క్ అవుట్స్ చేస్తూ కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ వస్తుంటారు.
తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సామ్ రోలర్ వర్క్ అవుట్ చేస్తూ కనిపిస్తున్నారు. కండరాల బలం, శారీరిక సమతుల్యతని పెంచడంలో ఈ వర్క్ అవుట్ ఉపయోగపడుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఫిట్‌నెస్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతని ఒక విషయం అడిగారు. సమంతకి సంబంధించిన ప్రతి మంచి చెడులను ఎందుకు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు..? వాటిని తన అభిమానులను కూడా ఫాలో అవ్వమని ఇన్‌డైరెక్ట్ గా చెబుతున్నారా..? అని ప్రశ్నించారు.
Also read : Manchu Manoj : బ్రదర్స్ మధ్య గొడవలు గురించి మాట్లాడిన మంచు మనోజ్..
Fitness Queen #Samantha sets major fitness goals with her workout video ? @Samanthaprabhu2 #SamanthaRuthPrabhu pic.twitter.com/u9SwwOFz1V
— Films Spicy (@Films_Spicy) November 25, 2023
దానికి సమంత బదులిస్తూ.. “సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి తనకి ఎదురయ్యే మంచి, చెడుని అందరికి చెబుతూనే దానిని వారు ఎలా ఎదుర్కొన్నారు అని తెలియజేయడం వారి భాద్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ సమస్య ఎవరైనా సామాన్యుడు ఎదుర్కొన్నప్పుడు.. మీరు దాటి వచ్చిన విషయమే వారికీ సమాధానం కావొచ్చు అందుకనే నా ప్రతి విషయం అభిమానులతో పంచుకుంటాను” అని సామ్ చెప్పారు. ఈ క్రమంలోనే మయోసైటిస్ పై తను చేస్తున్న పోరాటం అందరికి తెలియజేస్తూ వస్తున్నారు.
మయోసైటిస్ వల్ల కండరాల బలహీనత, కండరాల వాపును, చర్మ సమస్య, అలసట వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని చికిత్సతో పాటు ఫిజికల్ వర్క్ అవుట్స్ చేసి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సమంత ఇండియాలో మయోసైటిస్ పై అవగాహన కల్పించేందుకు బ్రాండ్ అంబాసడర్ గా భాద్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఆమె దాని మీద పోరాటం చేసే ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు.
