వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ మిహికా.. పిక్స్ షేర్ చేసిన సమంత..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం శనివారం(ఆగస్టు8) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.‘‘కుటుంబంలోకి స్వాగతం మిహికా’’ అంటూ అక్కినేని కోడలు సమంత దగ్గుబాటి వారి కోడలు మిహికా బజాజ్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. రానా- మిహికాల వివాహ వేడుక సందర్భంగా కుటుంబమంతా ఒక్కచోట చేరి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. సురేశ్ బాబు, వెంకటేశ్ కుటుంబాలతో పాటు దగ్గుబాటి ఆడపడుచులు, సమంత- నాగ చైతన్య కలిసి ఉన్న ఫొటోకు ఇప్పటికే భారీ సంఖ్యలో లైకులు వచ్చాయి.. ఫ్యాన్స్, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక రానా- మిహికాల మెహందీ, వివాహ వేడుకలో సమంత ధరించిన అవుట్‌ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పసుపు ఫంక్షన్‌లో ఎల్లో కలర్ డ్రెస్‌కు సీ షెల్ డిజైన్స్‌తో చేసిన నెక్‌పీస్ ధరించిన సామ్.. పెళ్లిలో బ్లూ కలర్ శారీకి లైట్ బ్లూ నెక్‌కాలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ మ్యాచ్ చేసి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సింపుల్ జువెలరీ, కొప్పు ముడితో యునిక్‌స్టైల్‌తో అదరగొట్టారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడమేకాక సామ్ ధరించిన డ్రెస్, శారీ అండ్ జువెలరీ కాస్ట్ గురించి కుడా మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోవిడ్-19 నిబంధనల నేపధ్యంలో ఇరుకుటుంబాల వారితోపాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ వంటి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.