Samantha and Vijay Devarakonda Enjoying in Turkey while kushi movie shoot gap
Vijay Devarakonda : సమంత(Samantha) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి(Kushi) సినిమా చేస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత మెయిన్ లీడ్స్ లో శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, ఒక సాంగ్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఖుషి సినిమా కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ, టర్కీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత కూడా టర్కీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇలా ఓ పక్కన షూటింగ్ జరుగుతుంటూనే తాము ఎంజాయ్ చేస్తూ సినిమాని కూడా ప్రమోట్ చేసేస్తున్నారు విజయ్, సమంతలు. విజయ్ గత సినిమా లైగర్, సమంత గత సినిమా శాకుంతలం రెండూ కూడా భారీ పరాజయాల్ని చూశాయి. ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా ఖుషి సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. అసలే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ పెట్టారు సినిమాకి. మరి ఈ టైటిల్ తో ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.