×
Ad

Samantha: పేరు మార్చుకున్న సమంత.. భర్త పేరు వచ్చేలా.. కొత్త పేరు ఏంటో తెలుసా?

మా ఇంటి బంగారం సినిమా నుంచి మారనున్న సమంత(Samantha) పేరు.

Samantha change her name as samantha nidimoru.

  • రెండో పెళ్లి తరువాత పేరు మార్చుకోనున్న సమంత
  • భర్త పేరు కలిసేలా సమంత నిడిమోరుగా మార్పు
  • మా ఇంటి బంగారం సినిమా నుంచి మారనున్న పేరు

Samantha: సౌత్ బ్యూటీ సమంత లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం పాటు మానసికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతోంది. లైఫ్ ని ఆనందంగా లీడ్ చేస్తోంది. ఈమధ్యే ఆమె రెండో పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె రెండో పెళ్లి చేసుకుంది.

అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత పెళ్లి వార్తను స్వయంగా సమంత(Samantha)నే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక అప్పటినుంచి భర్త రాజ్ తో ఆనందంగా కనిపిస్తోంది సమంత. అయితే, తాజాగా తన భర్త కోసం షాకింగ్ డెసిషన్ తీసుకుందట సమంత. అదేంటంటే, త్వరలో ఆమె తన పేరును మార్చుకోనుందట.

Satya Sri: జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ.. ఎంత క్యూట్ ఉందో చూడండి.. ఫొటోలు

ఇంతకాలం సమంత పేరు సమంత రుతు ప్రభుగా ఉండేది. కానీ, ఇప్పుడు తన భర్త ఇంటి పేరును తన పేరులో కలుపుకోనుందట. సమంత నిడిమోరుగా ఇక నుంచి తన పేరును మార్చుకోనుందట. ఆ పేరును అఫీషియల్ గా తాను ప్రెజెంట్ హీరోయిన్ గా చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా నుంచి యాడ్ చేయనుందట. అలాగే తన సోషల్ మీడియాలో అకౌంట్స్ లో కూడా సమంత నిడిమోరుగా పేరు మార్చనుందట. అది కూడా త్వరలోనే. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా నిర్మాతగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా కూడా థియేటర్స్ లోకి రానుంది. మరి చాలా కాలం తరువాత, అది కూడా రెండో పెళ్లి తరువాత సమంత చేస్తున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.