Samantha : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన సమంత.. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో ఏడ్చేసిన సామ్..

శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గుణశేఖర్ ఎమోషనల్ అయి సినిమా గురించి మాట్లాడుతుండగా సమంత కూడా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. ఇక సమంత మాట్లాడుతూ...................

Samantha gets emotional in shakunthalam trailer launch event

Samantha :  సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా సమయంలో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పట్నుంచి సమంత మళ్ళీ మీడియా ముందుకి రాలేదు. బయట కూడా కనపడలేదు. యశోద ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. దీంతో సమంత అభిమానులు ఆమెని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో సడెన్ గా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. సమంత కొంచెం సన్నగా అవ్వడం, ఫేస్ లో గ్లో తగ్గడంతో సమంత లుక్ మారిపోయిందని అభిమానులు నిరాశ చెందారు. తాజాగా సమంత నెక్స్ట్ సినిమా శాకుంతలం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా దీనికి చిత్ర యూనిట్ తో పాటు సమంత కూడా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాదాపు కొన్ని నెలల తర్వాత సమంత మీడియా ముందుకి రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Shaakuntalam : విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. గుణశేఖర్ మార్క్ మూవీ!

శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గుణశేఖర్ ఎమోషనల్ అయి సినిమా గురించి మాట్లాడుతుండగా సమంత కూడా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. ఇక సమంత మాట్లాడుతూ.. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రావాలి అనుకోని ఫిక్స్ అయి బలం తెచ్చుకొని మరీ వచ్చాను. సినిమా నేను ఊహించిన దానికంటే బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. సినిమా అంటే ప్రేమ ఉన్నవాళ్లు ఈ సినిమా తీశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా వస్తాను. దేవ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సెట్ లో మొదటి రోజు రాగానే చాలా మంది అమ్మాయిలు దేవ్ ని చూశారు. అప్పుడే దుశ్యంతుడి క్యారెక్టర్ కి సరిపోయాడు అనుకున్నాం. ఇండియన్ హిస్టరీలో బెస్ట్ క్యారెక్టర్ శకుంతల. అలాంటి క్యారెక్టర్ నాకు రావడం నా అదృష్టం. లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సినిమా మీద ప్రేమ మాత్రం మారదు. సినిమాలు చేస్తాను అని తెలిపింది. చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకి వచ్చి మాట్లాడటంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైరల్ గా మారింది. ఇక శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.