Samantha: కడపలో సామ్.. భారీగా ట్రాఫిక్ జామ్!
సినీ నటి సమంతా ఏపీలోని కడప నగరంలో సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సామ్ ముఖ్య అతిథిగా హాజరైంది.
- Naresh Mannam
- Published on- December 12, 2021 / 06:59 PM IST
Samantha
Samantha: సినీ నటి సమంతా ఏపీలోని కడప నగరంలో సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సామ్ ముఖ్య అతిథిగా హాజరైంది. సమంతా కడపకి వస్తుందన్న సమాచారంతో అభిమానులు, ప్రజలు, స్థానికులు షాపింగ్ మాల్ వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో కడప బస్టాండ్ సమీపం జనసంద్రంతో నిండిపోయింది.
Bigg Boss 5: ఫినాలేలో అడుగు పెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లు వీళ్ళే!
సమంతా కోసం షాపింగ్ మాల్ వద్దకు వచ్చిన అభిమానులంతా ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీ పడుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తూ ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. జనసంద్రం మధ్యనే షాపింగ్ మాల్‌ను ప్రారంభించి మాల్ కాసేపు సందడి చేసిన సమంతా షాపింగ్ మాల్ ప్రారంభం అనంతరం ఫ్యాన్స్‌కు అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!
ఇక సమంతా సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలంతో పాటు తమిళంలో నటించిన కాదు వాకుల రెండు కాదల్ విడుదలకి సిద్ధంగా ఉండగా యశోదా అనే మరో పాన్ ఇండియా సినిమా, ఓ హాలీవుడ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్పలో ఐటెం నెంబర్ తో పాటు ఇవి కాకుండా బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
