Samantha
Samantha : హీరోయిన్ సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. వీరిద్దరూ కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. గత మూడు రోజులుగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత ఫ్రెండ్స్ కూడా రోజుకు కొన్ని వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, అక్కడి ఆశ్రమం ఫొటోలు షేర్ చేస్తున్నారు.(Samantha)
Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?
తాజాగా సమంత ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి భర్తపై ఆసక్తికర పోస్ట్ పెట్టింది. సమంత రాజ్ నిడిమోరు మెడలో దండ వేసేముందు నువ్వుతున్న ఫోటోని షేర్ చేసి.. ఇక నుంచి అతని సమస్య నువ్వే అని తెలిసిన క్షణం అంటూ సరదాగా ఇంగ్లీష్ లో పోస్ట్ చేసింది. అలా రాజ్ నిడిమోరుకి సమస్య ఇకపై తనే అని సరదాగా పోస్ట్ చేసింది. దీంతో సమంత పోస్ట్, ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారాయి.
Also Read : Samantha : సమంత – రాజ్ పెళ్లి.. వచ్చిన అతిధులకు గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?