Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? భర్తతో కలిసి రాబోతున్న సమంత..
తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని ప్రకటించారు. (Maa Inti Bangaram)
- Saketh U
- Published on- June 14, 2026 / 05:34 PM IST
Maa Inti Bangaram
Maa Inti Bangaram : సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రాలాలా బ్యానర్ పై సమంత – రాజ్ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.మా ఇంటి బంగారం సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. సాధారణ కోడలిగా అత్తారింటికి వచ్చిన ఒక మహిళకు ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది.
తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15 సోమవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రాబోతుంది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Peddi Collections : అక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు.. పెద్ది కలెక్షన్స్ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
