Samantha makes emotional comments on trolling
Samantha: సమంత.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేదనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ, నాగ చైతన్యతో విడిపోయి ఇప్పుడు ఒంటరిగానే ఉంటోంది. ఆమధ్య (Samantha)మయోసైటివ్ వ్యాధితో కొంతకాలం బాధపడింది. ఈ మధ్యే ఆ సమస్య నుంచి కోలుకుంటున్న ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ తెరపై కనిపించేందుకు సిద్దమవుతోంది. ఈనేపధ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన విడాకుల సమయంలో కొంతమంది సంబరాలు చేసుకున్నారు అంటూ చెప్పి షాకిచ్చింది.
ShivaRaj kumar: తెరపైకి ప్రజానాయకుడి జీవితం.. “గుమ్మడి నర్సయ్య”గా శివరాజ్ కుమార్
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “కెరీర్ పరంగా నేను చాలా ఒడిదుగులను ఎదుర్కొన్నాను. నన్ను ద్వేషించేవాళ్ళు ఆ సమయంలో నన్ను చూసి చాలామంది నవ్వుకున్నారు. నాకు మాయోసైటిస్ వ్యాధి వచినప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళున్నారు. నా విడాకుల సమయంలో కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. నా జీవితం ఎలా ఉండబోతుందో కూడా వాళ్ళే నిర్ణయించేవారు. అవన్నీ చూసినప్పుడు చాలా భాదేసేది. కానీ, తరువాత నుంచి పట్టించుకోవడం మానేసాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక సినిమా చేయనుంది సమంత. అదే మా ఇంటి బంగారం. ఈ సినిమాను దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన “ఓహ్ బేబీ” సూపర్ హిట్ కావడంతో మా ఇంటి బంగారం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.