Kushi : ఖుషీ సమంత కొత్త లుక్ రిలీజ్.. ఫేస్ మారిపోయింది అంటున్న నెటిజెన్లు..
సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. నేడు సామ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. అయితే సమంత లుక్..
- gum 95921
- Published On : April 28, 2023 / 03:53 PM IST
Samantha new look release from Vijay Deverakonda Kushi
Kushi : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవల శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మైథిలాజికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేక పోయింది. ఆ మూవీకి ముందు వచ్చిన యశోద కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో సమంత అభిమానుల ఆశలన్నీ ఖుషీ సినిమా పైనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటించిన మజిలీ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?
ఇప్పుడు కూడా సామ్ కి అలాంటి విజయానే అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ లేటు అయ్యింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఇటీవలే మళ్ళీ ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నేడు సమంత పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ కొత్త లుక్ ని రిలీజ్ చేసింది. బ్లూ డ్రెస్ లో చేతిలో బ్యాగ్, మేడలో ఐడి కార్డు వేసుకొని ఆఫీస్ కి వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ లుక్ చూసిన కొందరు నెటిజెన్లు సమంత ఫేస్ మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!
మయోసైటిస్ సమంతని చాలా ఎఫెక్ట్ చేసింది. దానిని నుంచి కోలుకునేందుకు ఇప్పటికి హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (Hyperbaric Oxygen Therapy) తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే సమంత పేస్ కొంచెం వాడిపోయినట్లు కనిపిస్తుంది అంటున్నారు. దీంతో సమంత అభిమానులు ఆమెను కొంచెం రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవలే షూటింగ్స్ మొదలు పెట్టిన సమంత సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ కోసం భారీ కసరత్తలు చేసింది. కొన్నాళ్ళు అటువంటి రిస్క్ లు వద్దు అంటున్నారు ఫ్యాన్స్. మరి సమంత ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసి కొంచెం బ్రేక్ తీసుకుంటుందా? లేదా ముందుకు సాగుతుందా? చూడాలి.
Team #Kushi wishes the bundle of joy @Samanthaprabhu2, a very Happy Birthday ❤️
Keep spreading more kindness and happiness all around ?❤️@TheDeverakonda @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/F032oORuTH
— Mythri Movie Makers (@MythriOfficial) April 28, 2023
