Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!

సమంత కోసం తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలు సందర్శించిన వీరాభిమాని.. ఇప్పుడు గుడి కట్టిస్తున్నాడు.

Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!

Samantha fan construct a temple for her

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయినా ఆమె క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన సామ్ ప్రయాణం నేడు పాన్ ఇండియా వైడ్ వరకు చేరుకుంది. ఇక లైఫ్ లో మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురుకున్న సమంత.. అవన్నీ దాటుకుంటూ ఒక ఫైటర్ లా ముందుకు సాగుతుంది. ఆ వ్యక్తిత్వమే ఆమెకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. తాజాగా ఒక ఫ్యాన్ సమంత మీద వీరాభిమానంతో ఆమెకు ఏకంగా గుడి కట్టేందుకు సిద్దమయ్యాడు.

Vishwak Sen : కొత్త అవతారంలో విశ్వక్ కొత్త సినిమా లాంచ్.. సూపర్ హిట్ కాంబినేషన్!

బాపట్ల జిల్లా ఆలాపడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతని అమితంగా అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే సమంతకు మాయోసైటిస్ ఎటాక్ అయ్యినప్పుడు.. ఆమె దాని నుంచి త్వరగా కోలుకోవాలంటూ తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలు సందర్శించి మొక్కుబడులు చెల్లించాడు. ఇప్పుడు తన ఇంటిలోనే సమంతకు గుడి కట్టి, అందులో ఆమె విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ గుడిని ఏప్రిల్ 28న సమంత బర్త్ డే కానుకగా ఓపెన్ చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Chandrabose : చంద్రబోస్‎కి ఆస్ట్రేలియా ప్రభుత్వం సత్కారం.. గ్యాలరీ!

కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఖుషీ సినిమాలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ మ్యాన్ తో తనకి పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసిన రాజ్ డికె తో కలిసి ఈ సిరీస్ ని తెరకెక్కుస్తుంది. ఇక బర్త్ డే రోజు ఈ రెండు చిత్రలు నుంచి ఏమన్నా అప్డేట్స్ వస్తాయా? లేదా? చూడాలి.