Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?
సమంత ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్లు సామ్ కి ఏముందని కంగారు పడుతుంది. అసలు విషయం ఏంటంటే..

Samantha taking Hyperbaric Oxygen Therapy for Myositis
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మాయోసైటిస్ వ్యాధి భారిన పడి అనారోగ్యంతో ఇబ్బందులు పడింది. చాలా రోజులు పాటు బయటకి రాకుండా, తన ఆరోగ్య పరిస్థితిని కూడా ఎవరికి తెలియజేయకుండా జీవించింది. యశోద మూవీ ప్రమోషన్స్ కోసం బయటకి వచ్చిన సమంత తను ఎదురుకుంటున్న సమస్యను బయట పెట్టింది. ఇక ఇటీవలే ఆ అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆ పోస్ట్ ని స్వయంగా సమంత పోస్ట్ చేయడంతో అభిమానులు కలవర పడుతున్నారు.
Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!
అయితే ఆ ఆక్సిజన్ మాస్క్ పిక్ తో పాటు దానిని పెట్టుకోవడం వెనుక ఉన్న రీజన్ ని కూడా షేర్ చేసింది. హైపర్బేరిక్ థెరపీ (Hyperbaric Oxygen Therapy) కోసం సమంత ఆ మాస్క్ పెట్టుకున్నట్లు తెలియజేసింది. అలాగే దాని వల్ల కలిగే ఉపయోగాలు కూడా చెప్పుకొచ్చింది. పాడైన కండరాలను బాగుచేయడం, కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని వెల్లడించింది. మయోసైటిస్ సోకిన నేపథ్యంలోనే సమంత ఈ థెరఫీ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ థెరఫీ గురించి తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Samantha : సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?
కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో (Vijay Deverkonda) కలిసి ఖుషీ సినిమా చేస్తుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చితం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. యశోద, శాకుంతలం సినిమాలు సమంతకి విజయాన్ని అందించలేక పోయాయి. మరి ఖుషీ సినిమా అయినా సామ్ కి సక్సెస్ ని అందిస్తుందా? లేదా? చూడాలి. ఈ మూవీతో పాటు సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఆ సిరీస్ లో సమంత స్పైగా కనిపించబోతుంది.
View this post on Instagram