Samantha practicing boxing in 8 degree Celsius at nainital for citadel series with hollywood fight master
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఓ పక్కన షూటింగ్స్ లో పాల్గొంటూనే మరోపక్క ప్రమోషన్స్ కి వస్తుంది. ఇక మళ్ళీ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ కష్టపడుతుంది. జిమ్ లో కష్టపడే వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయింది సమంత. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ చేస్తోంది.
సిటాడెల్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం నైనిటాల్ లో మంచు కొండల్లో మధ్య జరుగుతుంది. సమంత ప్రస్తుతం అక్కడే ఉంటూ షూటింగ్ లో పాల్గొంటుంది. తాజాగా సమంత తెల్లవారుజామున 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ స్టోరీ పోస్ట్ చేస్తూ నాకిష్టమైన వ్యక్తి అంటూ యానిక్ బెన్ అనే వ్యక్తిని ట్యాగ్ చేసింది. హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్‌బెన్ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ కి వర్క్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సమంతతో తెల్లవారుజామున బాక్సింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.
RC16 Heroine : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో సీతారామం హీరోయిన్?
ఇక సమంత పెట్టిన పోస్ట్ చూసి ఇటీవలే ఆరోగ్యం కుదుటపడి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంత చలిలో ఇవన్నీ అవసరమా అంటూనే మరోపక్క తన పట్టుదల, వృత్తిపై ఇష్టం చూసి అంతా అభినందిస్తున్నారు. సమంత మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరిన్ని సినిమాలతో మన ముందుకి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ బాక్సింగ్ పోస్ట్ తో పాటు నైనిటాల్ లో ఉన్న నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఫోటో కూడా షేర్ చేసింది సామ్.