Samantha - Raj
Samantha – Raj : సమంత – రాజ్ నిడిమోరు ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. 2020 లోనే వీరి పరిచయం కాగా 2021 నుంచే వీరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. గత కొన్ని రోజులుగా వీరిపై వస్తున్న ప్రేమ పుకార్లకు పెళ్లితో శుభం కార్డు వేశారు. ఇప్పటికే సమంత – రాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Samantha – Raj)
ఈ క్రమంలో సమంత వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ కూడా వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకంగా డైమండ్స్ చేయించిందని, పాతకాలం రాయల్ స్టైల్ అని, దీని ధర దాదాపు 50 లక్షలు అని అనేక కథనాలు వచ్చాయి ఈ వెడ్డింగ్ రింగ్ పై. అయితే ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని, సమంత దాదాపు 10 నెలల క్రితం నుంచే ఈ రింగ్ పెట్టుకుంటుందని వార్తలు ఇప్పుడు ప్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : AKhanda 2 : బాలయ్య బాబుకు షాక్.. ‘అఖండ 2’ విడుదల ఆపేసిన హైకోర్టు.. మహేష్ సినిమా ఎఫెక్ట్..?
దీంతో సమంత పాత ఫోటోలు చెక్ చేస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. సమంత చాలా సార్లు పబ్లిక్ గా ఈ రింగ్ పెట్టుకొని వచ్చింది. ఈ రింగ్ తో సమంత అనేక ఫోటోలు షేర్ చేసింది కూడా. అంటే రాజ్ – సమంత నిశ్చితార్థం ఎప్పుడో చేసుకున్నారు అని భావిస్తున్నారు. సమంత ఎంగేజ్మెంట్ రింగ్ తో చాలా సార్లు హింట్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత – రాజ్ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు అనే వార్తలకు ఈ పెళ్లితో ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇదంతా నిజమే మనమే ఇన్నాళ్లు రూమర్స్ అనుకున్నామని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?