Raviteja
Raviteja : రవితేజ – సమంత.. ఇద్దరూ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. సమంత అయితే సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. రవితేజ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. ధమాకా హిట్ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇటీవల మాస్ జాతర.. ఇలా వరుస ఫ్లాప్స్ చూసాడు రవితేజ. దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.(Raviteja)
ఇటీవల ఫ్యాన్స్ రవితేజకి ఓపెన్ లెటర్ రాయగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ చేతిలో భర్త మహాశేయులకు విజ్ఞప్తి అనే సినిమా ఉంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని ప్రకటించారు. ఈ సినిమా అయినా హిట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు.
Also Read : Samantha : కోపం ఎందుకు సమంత..? ఫిట్నెస్ పోస్ట్ పై నెటిజన్ కామెంట్.. సమంత రిప్లై వైరల్..
అయితే ఇటీవల రవితేజ – సమంత కలిసి సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమాలో వీరిద్దరూ నటిస్తారని వార్తలు వచ్చాయి. శివ నిర్వాణ గతంలో సమంతతో మజిలీ, ఖుషి సినిమాలు చేసాడు. దీంతో సమంతతో శివ నిర్వాణకు మంచి అనుబంధము ఉంది. ఈ క్రమంలో శివ నిర్వాణ కథ చెప్పగా సమంత ఓకే చెప్పింది అని వార్తలు వచ్చాయి. అసలు రవితేజ – సమంత కాంబినేషన్ ఏంటి? ఫ్లాప్స్ లో ఉన్న హీరో, హీరోయిన్, దర్శకుడు కలిసి సినిమా చేస్తారా అని అంతా భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ఈ సినిమాలో నటించట్లేదట. సమంత ప్లేస్ లోకి తమిళ భామ ప్రియా భవాని శంకర్ ని తీసుకున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ – ప్రియా భవాని శంకర్ జంటగా థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నారట. మరి ఈ సినిమా అయినా రవితేజకు హిట్ ఇస్తుందా చూడాలి. ప్రియా భవాని శంకర్ తెలుగులో ఇప్పటికే కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా.. సినిమాల్లో నటించింది.
Also Read : Nivetha Pethuraj : కుక్క కరిస్తే పెద్ద విషయం కాదట.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. భగ్గుమన్న నెటిజన్లు..