పెళ్లి తర్వాత కూడా వదల్లేదు.. అతడితో బ్రేకప్ అవకపోతే మరో సావిత్రి అయ్యుండేదాన్ని.. సమంత సెన్సేషనల్ కామెంట్స్..

హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకున్న సమంత తాజా ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేసింది..

  • Publish Date - March 19, 2020 / 03:33 PM IST

హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకున్న సమంత తాజా ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేసింది..

పెళ్లి తర్వాత కథానాయికగా సమంత అక్కినేని స్పీడ్ మరింత పెరిగింది. పూజా హెగ్డే, రష్మికా మందన్నా వంటి కుర్ర హీరోయిన్స్ వచ్చాక కూడా ఆమె క్రేజ్ తగ్గలేదు. ‘రంగస్థలం’, ‘యూ టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబి’, ‘జాను’.. ఇలా సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, సత్తా చాటుతూనే ఉంది.

ప్రస్తుతం వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో సమంత ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ టైమ్స్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 

పెళ్లి తర్వాత కూడా తన డ్రెస్సింగ్ గురించి ట్రోల్ చేశారని, మాజీ ప్రియుడితో బ్రేకప్ అవకపోతే తన జీవితం ఎలా ఉండేది ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ చెప్పుకొచ్చిందామె..
‘‘పైళ్లైన కొత్తలో నేను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన  పిక్స్‌లో నా డ్రెస్సింగ్ (రివీలింగ్‌ అవుట్‌ఫిట్‌) గురించి కొంతమంది దారుణంగా ట్రోలింగ్‌ చేశారు.

పెళ్లికి ముందు అంటే గ్లామర్ రోల్స్ చేసాను కాబట్టి అలా కామెంట్ చేశారులే అనుకోవచ్చు. కానీ పెళ్లి తర్వాత కూడా కొంతమంది నెటిజన్స్ నన్ను వదల్లేదు. వాళ్ల కామెంట్స్ చూసి చాలా బాధపడ్డాను. అయితే రెండోసారి అలాంటి డ్రెస్ వేసుకున్న ఫోటోలను పోస్ట్‌ చేసినప్పుడు మాత్రం ట్రోలింగ్‌ కొంచెం తగ్గింది. ఏదైనా ఫస్ట్ స్టెప్ వేసేటప్పడే కష్టంగా ఉంటుంది.

 

ట్రోలింగ్‌ ఎదుర్కొన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో ట్రోలింగ్‌ చేసే వారి ఆలోచన మార్చాలని అనుకున్నాను. అందుకోసం నా వంతు చేయగలిగింది నేను త్వరలో చేయబోతున్నాను’ అన్నారు. అలాగే తన జీవితంలో ప్రేమ విషయంలో సరైన సమయంలో మేల్కొన్నాను లేకపోతే మరో సావిత్రి అయ్యుండేదాన్నని షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. 

‘‘మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు సంభవించాయో నా జీవితంలోనూ అలాంటివే చోటుచేసుకున్నాయి. అయితే నేను ముందుగానే జాగ్రత్తపడి, పరిస్థితి చేయదాటక ముందే ఆ బంధం నుంచి బయటపడ్డాను. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది.. ఆ తర్వాత చైతు లాంటి గొప్ప వ్యక్తితో లైఫ్ షేర్ చేసుకునే చాన్స్ లభించింద’’ని చెప్పింది సమంత అక్కినేని.