Shaakuntalam: టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, తన హోం బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Shaakuntalam: ‘శాకుంతలం’ను భారీగా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?
అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. రీసెంట్గా ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడంతో, ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ వెనకడుగు వేయదని అందరూ అనుకున్నారు.
Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
కానీ, మరోసారి ప్రేక్షకులకు శాకుంతలం చిత్ర యూనిట్ ఝలక్ ఇచ్చింది. ఈ సినిమాను 3Dలోనూ రిలీజ్ చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అనుభూతిని అందరూ అందుకునేందుకే మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మళ్లీ వెనకడుగు వేసింది. అయితే ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేస్తారా లేక ఇలా వరుసగా వాయిదా వేస్తూ కాలం గడిపేస్తారా అంటూ అభిమానులు గుణశేఖర్ అండ్ టీమ్‌పై ఫైర్ అవుతున్నారు. సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
We will be announcing the new release date soon!
‘#???????????? ???? ?? ??’.@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/5frmUzwMcN— Gunaa Teamworks (@GunaaTeamworks) September 29, 2022