Shaakuntalam: ‘శాకుంతలం’ను భారీగా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. శాకుంతలం సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా స్టార్ నిర్మాత దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ విషయంలో తనదైన స్ట్రాటెజీని ఫాలో అవబోతున్నట్లు తెలుస్తోంది.

Shaakuntalam: ‘శాకుంతలం’ను భారీగా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు..?

Dil Raju Planning Big For Shaakunthalam

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కాగా, ఇటీవల ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

ఇక శాకుంతలం సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా స్టార్ నిర్మాత దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఇప్పటికే శాకుంతలం ఫస్ట్ కాపీని చూసిన దిల్ రాజు, ఈ సినిమా అద్భుతంగా రావడంతో.. ఈ సినిమా రిలీజ్ విషయంలో తనదైన స్ట్రాటెజీని ఫాలో అవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నందున, ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడతారని ఆయన భావిస్తున్నాడు.

Shaakuntalam: శాకుంతలం నుంచి తాజా అప్డేట్.. ఏమిటంటే?

అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ సినిమాను గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతంగా ఉందని ఆయన చిత్ర యూనిట్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి శాకుంతలం సినిమాను దిల్ రాజు ఏ స్థాయిలో రిలీజ్ చేస్తాడో తెలియాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ షురూ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.