Shaakuntalam: శాకుంతలం నుంచి తాజా అప్డేట్.. ఏమిటంటే?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ షూటింగ్ ముగించుకుని చాలా రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని తగ్గకుండా ఉండేందుకు గుణశేఖర్ భార్య నీలిమా గుణ తాజాగా ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేసింది.

Shaakuntalam: శాకుంతలం నుంచి తాజా అప్డేట్.. ఏమిటంటే?
ad

Shaakuntalam: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ షూటింగ్ ముగించుకుని చాలా రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా, మైథలాజికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..

అయితే ప్రేక్షకలు పలుమార్లు ఈ సినిమా అప్డేట్స్ గురించి అడిగినా చిత్ర యూనిట్ రెస్పాండ్ కాలేదు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని తగ్గకుండా ఉండేందుకు గుణశేఖర్ భార్య నీలిమా గుణ తాజాగా ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేసింది. ‘శాకుంతలం’ సినిమా అందరూ మెచ్చే విధంగా అందించేందుకు తామెంతో కృషి చేస్తున్నామని.. సినిమా షూటింగ్ ముగిసినా, గ్రాఫిక్స్ వర్క్ కోసం చాలా సమయం పడుతుందని ఆమె పేర్కొంది. మంచి ఔట్‌పుట్ రావాలని తాము ప్రయత్నిస్తున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్‌లో జాప్యం జరుగుతుందని ఆమె తెలిపింది.

Allu Arha : లిటిల్ ప్రిన్సెస్ సెట్లో అడుగుపెట్టింది..

తమను అర్థం చేసుకుని, శాకుంతలం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మొత్తానికి శాకుంతలం సినిమా గురించిన అప్డేట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయో గుణ శేఖర్ భార్య నుండి క్లారిటీ రావడంతో, ఈ సినిమా మంచి కంటెంట్‌తో వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దేవ్ మోహన్, అనన్యా నాగళ్ళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి శాకుంతలం చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని సామ్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.