Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’ తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటినుండో ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమాను మైథలాజికల్ డ్రామాగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో అందాల భామ సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.

Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Samantha Shaakuntalam Locks Release Date

Shaakuntalam: టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’ తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటినుండో ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమాను మైథలాజికల్ డ్రామాగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో అందాల భామ సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Shaakuntalam: శాకుంతలం నుంచి తాజా అప్డేట్.. ఏమిటంటే?

కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. వారిని ఇంకా వెయిట్ చేయించడం మంచిది కాదని భావించిన చిత్ర యూనిట్, ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీనికి సంబంధించి ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో సమంత, దేవ్ మోహన్.. శకుంతల, దుశ్యంతలుగా పోజిచ్చిన తీరు అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.

Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..

దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో తన హోం బ్యానర్ గుణ టీమ్ వర్క్స్‌పై ప్రొడ్యూస్ చేయగా, మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి నవంబర్ 4న పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘శాకుంతలం’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.