చై బర్త్‌డే – సమంత హార్ట్ టచింగ్ పోస్ట్
నవంబర్ 23 నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన భర్త నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ సమంత హార్ట్ టచింగ్ పోస్ట్ చేసింది..

నవంబర్ 23 నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన భర్త నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ సమంత హార్ట్ టచింగ్ పోస్ట్ చేసింది..
అక్కినేని మూడో తరం వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, సినిమా సినిమాకీ నటుడిగా తనని తాను సానబెట్టుకుంటూ.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకన్నాడు యువసామ్రాట్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య. ‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఏమాయ చేసావే’, ‘100% లవ్’, ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’ చిత్రాలతో లవర్ బాయ్‌గా యూత్‌ను.. ‘దడ’, ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాలతో మాస్ ఫ్యాన్స్‌కు.. ‘మనం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘తడాఖా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా చేరువయ్యాడు. ఎప్పటికప్పుడు నటనలో వేరియేషన్ చూపిస్తూ అన్ని రకాల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
నవంబర్ 23 నాగచైతన్య 33వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తన భర్త నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ సమంత హార్ట్ టచింగ్ పోస్ట్ చేసింది.
Read Also : వెంకీమామ – అల్లుడు బర్త్‌డే గ్లింప్స్ అదిరింది!
‘చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం రోజూ ప్రార్ధనలు చేస్తున్నాను. వృత్తి పరంగా, వ్యక్తిత్వంలో రోజురోజుకు ఎదుగుతున్నావ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా, ధైర్యంగా ఉంటుంది. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐలవ్ యూ డార్లింగ్’ అంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషట్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చై పుట్టినరోజు సందర్భంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Happy birthday my @chay_akkineni ❤️ Every single day I pray for your happiness and I am so proud that with every passing day you have grown to be the best version of yourself .. and I believe with all my heart that we are stronger together .. I love you darling husband ❤️ pic.twitter.com/cSvxTboB8V
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 23, 2019