Samantha
Samantha : హీరోయిన్ సమంత ఏ పోస్ట్ పెట్టినా అది తన పర్సనల్ లైఫ్ కు సింక్ అవుతోంది. కమర్షియల్ యాడ్ అయినా.. అందులో మీనింగ్ మాత్రం ఆమె లైఫ్ ను కచ్చితంగా లింక్ ఉంటోంది. ఇది కాకతాళీయమో… అనుకుని చేస్తున్నదో కానీ.. సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు… ఆమె లైఫ్ లో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబిస్తున్నాయి.
Samantha : ఎఫైర్లు, అబార్షన్ల వార్తలపై సమంత ఘాటు స్పందన
Unacademy అనే సంస్థ సచిన్ సహా… క్రికెటర్ల క్యాచ్ డ్రాప్ లతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియో “తప్పులు – నేర్పే పాఠాలు” థీమ్ తో రూపొందింది. ఈ వీడియోను సమంత షేర్ చేసింది. ఈ వీడియోలోని లిరిక్స్ ను ఉద్దేశించి… బ్యూటీఫుల్ మెసేజ్ – హిలేరియస్ ఎగ్జిక్యూషన్ అని సమంత కామెంట్ చేసింది.
“తప్పు చేస్తేనే పరిష్కారం దొరుకుతుంది.
చేసిన తప్పులే నేర్చుకోవడానికి పనికొస్తాయి.
జీవితంలో తప్పులకు కూడా పర్మిషనుంది భాయ్..
తప్పులు చేస్తేనే ఛాంపియన్ కాగలవు
వినోదం కోసం తప్పులు చేస్తాం… కానీ అవి మనకు చాలా నేర్పుతాయి
చిన్న తప్పు.. పెద్ద తప్పు… నేరుగా తప్పు.. పరోక్ష తప్పు.. ఎన్నిరకాలున్నా.. తప్పు చేయకపోతే ప్రాబ్లమ్ ఎలా క్రాక్ అవుతుంది..ఇవి క్రాక్స్ కానే కావు. లెసన్స్” అనేలా ఈ పాట సాగుతుంది.
సమంత చేసిన ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. Learning From Mistakes అనేది మంచి కాన్సెప్ట్ అంటూ సపోర్ట్ ఇస్తున్నారు.
Beautiful message, hilarious execution! @unacademy way to beat everyone’s Monday blues! Kudos ?? #IPLUnacademyFilm #ad pic.twitter.com/ckrpKV7Rwb
— Samantha (@Samanthaprabhu2) October 11, 2021